Saturday, December 21, 2024

ఉగ్రవాదుల దాడి…. మరో ఎయిర్‌ఫోర్స్ జవాన్ మృతి

- Advertisement -
- Advertisement -

జమ్ము కశ్మీర్: దేశంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జమ్ము కశ్మీర్ లో ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదుల దాడిలో గాయపడిన ఎయిర్‌ఫోర్స్ జవాన్ మృతి చెందాడు. జమ్ములోని పూంఛ్ జిల్లాలోని సూరన్ కోట్ ప్రాంతంలో ఎయిర్‌ఫోర్స్ కాన్వాయ్‌పై ఆదివారం రాత్రి ఉగ్రదాడి జరిగింది. నిన్న రాత్రి జరిగిన దాడిలో ఒకరు మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరో ఎయిర్‌ఫోర్స్ జవాన్ దుర్మరణం చెందాడు. దాడి జరిగిన వెంటనే ఉగ్రవాదలు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులను ఏరివేసేందుకు యాంటీ టెర్రర్ ఆపరేషన్ జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News