Saturday, December 21, 2024

ఆదిలాబాద్‌ను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తాం: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

నిర్మల్: ఆదిలాబాద్ ఎంపి టికెట్ ఒక్కసారి కూడా మహిళకు దక్కలేదని, తొలిసారి ఆత్రం సుగుణకు ఆదిలాబాద్ ఎంపి టికెట్ దక్కించుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని, ఆదిలాబాద్‌ను దత్తత తీసుకొని అభివృద్ధి చేసే బాధ్యత తనదన్నారు. నిర్మల్‌లో కాంగ్రెస్ జనజాతర సభకు ఎఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ, సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క హాజరయ్యారు. రాహుల్‌కు కుమురంభీం చిత్రపటాన్ని సీతక్క ఆదివాసీలు అందజేశారు. కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా రాహుల్ ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా రేవంత్ ప్రసంగించారు. బలహీనవర్గాలు గుండెచప్పుడు విన్న నేత రాహుల్ గాంధీ అని, ఆదిలాబాద్‌లో మూతపడిన సిసిఐ పరిశ్రమను తెరిపించే బాధ్యత కాంగ్రెస్‌దేనని, ఈ నెల 9వ తేదీలోపు రైతు భరోసా నిధుల ఖాతాల్లో జమచేస్తామని, పంద్రాగస్టు లోపు ఒకే విడతలో రూ. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని, కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే ఐదు అమలు చేశామని స్పష్టం చేశారు. తెలంగాణకు బిజెపి గాడిద గుడ్డు ఇచ్చిందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News