Wednesday, December 25, 2024

జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ కు బెయిల్

- Advertisement -
- Advertisement -

ముంబై: మనీలాండరింగ్ కేసులో జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్(75) కు ఆరోగ్య పరిస్థితి కారణంగా బాంబే హైకోర్టు సోమవారం రెండు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.  మనీలాండరింగ్ కేసులో గోయల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడి) అరెస్టు చేసింది. గోయల్ కు షరతులతో తాత్కాలిక బెయిల్ ఇచ్చారు. ఆయనను తన పాస్ పోర్టును కూడా అప్పగించాలని ఆదేశించారు.

ఆరోగ్య పరిస్థితి, మానవతా దృష్ట్యా తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా విన్నవించుకున్నారు. ఆయన, ఆయన భార్య అనితా గోయల్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. గోయల్ కెనరా బ్యాంక్ నుంచి జెట్ ఎయిర్వేస్ కు దాదాపు రూ. 538.62 కోట్లు తీసుకుని స్వాహా చేశారు. ఆయనపై మనీలాండరింగ్ ఆరోపణలు రావడంతో 2023 సెప్టెంబర్ లో ఈడి అరెస్టు చేసింది. ఆయన భార్యను కూడా 2023 నవంబర్ లో ఈడి అరెస్టు చేసింది. అయితే ఆమె వయస్సు, ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆమెకు అదే రోజున స్పెషల్ కోర్టు బెయిల్ ఇచ్చింది.

గోయల్ శారీరక బాధలు, ఆయన భార్య అనారోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మానవతా దృష్ట్యా బెయిల్ ఇవ్వాల్సిందిగా ఆయన తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే కోర్టుకు విన్నవించుకున్నారు.  తన చివరి రోజుల్లో గోయల్ తన భార్య దగ్గర ఉండాలనుకుంటున్నారని కూడా తెలిపారు. ఇదిలావుండగా తాజా మెడికల్ రిపోర్టు లేనందున ఆయన బెయిల్ ను వ్యతిరేకిస్తున్నామని, కాకపోతే ఆయనను ఆసుపత్రిలో ఉంచే కాలపరిమితిని పొడగించుకోవచ్చని ఈడి తరపు వకీలు హితేన్ వెనెగావోంకర్  వాదించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News