Wednesday, November 27, 2024

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడిన 8.37 కిలోల బంగారం

- Advertisement -
- Advertisement -

ముంబై: ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో గత నాలుగు రోజులుగా జరిగిన ఆపరేషన్‌లో రూ. 8.37 కోట్ల విలువచేసే 12.47 కిలోల బంగారాన్ని, ఎలెక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకుని, 10 మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు సోమవారం ఒక అధికారి వెల్లడించారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏప్రిల్ 29 నుంచి మే 2వ తేదీ వరకు ఈ ఆపరేషన్ జరిగింది. వివిధ ప్రయాణికులు బంగారం పొడిని మైనం రూపంలో, వస్త్రాల అల్లికలో, నగలు, కడ్డీలుగా, మంచినీళ్ల బాటిళ్లలో, కొందరు తమ పురీషలాళంలో దాచుకుని తరలిస్తుండగా పట్టుబడ్డారు. ఇందుకు సంబంధించిన ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఆ అధికారం ఒక ప్రకటనలో తెలిపారు.

విమానాశ్రయంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న ఒక వ్యక్తిని సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది అదుపులోకి తనిఖీ చేయగా మేనంలో రూపంలో ఉన్న బంగారం పొడిని(8 ముక్కలు) వాటర్ బాటిల్‌లో కనుగొన్నారు. దీని బరువు 2.58 కిలోలు ఉన్నట్లు తెలిపారు. ఆ వ్యక్తిని అరెస్టు చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. మరో ఘటనలో దుబాయ్ నుంచి వస్తున్న నలుగురు భారతీయులను తనిఖీ చేయగా లోదుస్తులలో, పురీషనాళంలో దాచిన 3.35 కిలోల బంగారం లభించింది. ఆ నలుగురిని అరెస్టు చేసినట్లు ప్రకటనలో తెలిపారు.

అదే విధంగా విమానంలో సీటు కింద పైపులలో దాచిన 1.5 కిలోల బరువున్న ఆరు బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. వీరే గాక దుబాయ్ నుంచి వస్తున్న 10 మందితోసహా 15 మంది భారతీయులను తనిఖీ చేయగా లోదుస్తులలో, జీన్స్ పాకెట్లలో, ఎయిర్ లగేజ్ ట్రాలీకి చెందిన బాస్కెట్, కొందరు తమ పురీషనాళంలో దాచిన 5.32 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటనలో అధికారి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News