Friday, November 15, 2024

ఒడిశా పేదరికానికి బిజెడి కారణం: మోడీ

- Advertisement -
- Advertisement -

స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా ఒడిశాను పేద రాష్ట్రంగా మారడానికి కాంగ్రెస్, బిజూ జనతా దళ్(బిజెడి) కారణమని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. సోమవారం నాడిక్కడ ఎన్నకల ప్రచారంలో భాగంగా ఒక ర్యాలీనుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ఒడిశాకు నీరు, సారవంతమైన భూమి, ఖనిజాలు, సుదీర్ఘమైన కోస్తా తీరం, చరిత్ర, సంస్కృతి.అన్నిటిని భగవంతుడు ఇచ్చాడని అన్నారు. అయినప్పటికీ ఒడిశా ప్రజలు ఎందుకు పదరికంలో మగ్గుతున్నారని ప్రధాని ప్రశ్నించారు. దీనికి సమాధానం మొదటి కాంగ్రెస్ నాయకులు లూటీ చేయగా తర్వాత బిజెడి నాయకులు లూటీ చేశారని ప్రధాని ఆరోపించారు. బిజెడికి చెందిన చిన్న నాయకులకు సైతం పెద్ద బంగళాలు ఉన్నాయని ఆయన చెపారు. గంజాం జిల్లాలో ఒక ప్రచార సభలో ప్రధాని ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్న హింజిలి నియోజవకర్గం కూలీలు ఎందుకు ఇతర రాష్ట్రాలకు వలసలు పోతున్నారని ప్రశ్నించారు.

ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్ పోస్టులు ఎందుకు ఖాళీగా ఉంటున్నాయని ప్రధాని నిలదీశారు. ఎందుకు పిల్లలు మధ్యలోనే స్కూళ్లను మానేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఒడిశా అభివృద్ధి కోసం నిధులు కేటాయించడానికి తాను ఎన్నడూ వెనుకాడలేదని ప్రధాని చెప్పారు. కేంద్రంలో సోనియా గాంధీ చేతిలో రిమోట్ కంట్రోల్ ఉన్న మన్మోహన్ సింగ్ పదేళ్ల పాటు అధికారంలో ఉన్నపుడు ఒడిశాకు పదేళ్లలో రూ. 1 లక్ష కోట్లు అందయాని, కాని తన ప్రభుత్వం పదేళ్లలో రూ. 3.5 లక్షల కోట్లు అందచేసిందని మోడీ చెప్పారు. అయితే నిధులు సమకూర్చినంత మాత్రాన అభివృద్ధి జరగదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. మహిళల సంక్షేమం ఒడిశా ప్రభుత్వానికి పట్టలేదని ఆయన ఆరోపించారు. గర్భిణులకు నెలకు రూ. 6000 సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తోందని, ఈ ముఖ్యమైన పథకాన్ని ఒడిశా ప్రభుత్వం నిలిపివేసిందంటే మీరు ఆశ్చర్యపోతారని మోడీ తెలిపారు. జల్ జీవన్ మిషన్ కోసం రూ. 10,000 కోట్లను కేంద్రం పంపిస్తే ఆ నిధులను కూడా ఇక్కడి ప్రభుత్వం ఖర్చు చేయలేదని ఆయన చెప్పారు.

గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల నిర్మాణం కోసం మోడీ నిధులు పంపించినప్పటికీ రాష్ట్రంలో రోడ్లు అద్వానంగా ఉన్నాయి. ఉచిత బియ్యం కోసం మోడీ డబ్బు పంపిస్తే బియ్యం పాకెట్లపై బిజెడి ప్రభుత్వం తన బొమ్మ వేసుకుంటుంది అని మోడీ విమర్శించారు. బిజెపిని అధికారంలోకి తీసుకురావాలని ఒడి శా ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారని ప్రధాని తెలిపారు. జూన్ 4తో బిజెడి ప్రభుత్వానికి కాలం చెల్లిపోతుంది. ఒడిశా అభివృద్ధికి బిజెపి ఒక ఆశాకిరణం అని ఆయన అన్నారు. ఒడిశాలోని 21 లోక్‌సభ స్థానాలు, 147 అసెంబ్లీ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఒడిశాలో తదుపరి ప్రభుత్వాన్ని బిజెపి ఏర్పాటు చేస్తుందన్న ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పందించారు. బిజెపి పగటి కలలు కంటోంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News