Sunday, January 19, 2025

పౌరాణికం, సైన్స్ మిళితమై..

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా ‘కల్కి 2898’ విడుదల కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో ఏం చెప్పబోతున్నారు? అన్న ఆసక్తి ప్రేక్షకాభిమానుల్లో కనిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు నాగ్ అశ్విన్ ఇండియా భవిష్యత్తుని సినిమాలో చూపించబోతున్నట్లు తెలియజేశాడు. శతాబ్ధాల క్రిందకెళ్లి మరీ చరిత్రని తిరగేసి, నేటి సాంకేతికతను జోడించి..భవిష్యత్తు ఇండియాని చూపించబోతున్నాడు.

ఇటీవలే అమితాబచ్చన్ పాత్రను అశ్వత్థామగా పరిచయం చేశారు ఫిల్మ్‌మేకర్స్. ఇక ఈ సినిమా పౌరాణికం -,సైన్స్ మిళితమై ఉంటుందని క్లారిటీ వచ్చింది. అయితే ’మైడియర్ దొంగ’ చిత్రానికి దర్శకత్వం వహించిన సర్వజ్ఞ కుమార్ తాజాగా కల్కి సినిమా గురించి మాట్లాడుతూ “నేను కల్కి సినిమాకు అదనపు రచయితగా పనిచేశాను. సినిమా గురించి నేను ఇప్పుడే చెప్పలేను కానీ ఇంతకు ముందు ఎవరూ ప్రయత్నించని ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉంటుందని చెప్పగలను. ఇంతవరకూ ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమా రాలేదు”అని అన్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా దీపికా పదుకోణే నటించింది. లెజెండరీ కమల్ హాసన్ అతిధి పాత్రలో నటించారు. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వని దత్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Kalki 2898 Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News