Sunday, January 19, 2025

కెటిఆర్‌పై రఘునందన్ సంచలన వ్యాఖ్యలు… ‘రామ్ బదులు ఆ పేరు పెట్టుకో’

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శ్రీరాముడి పేరుతోనే బిజెపి జనంలోకి వెళ్తోందని, అవి అక్షింతలు కాదు అని రేషన్ బియ్యం అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చేసిన వ్యాఖ్యలకు మెదక్ బిజెపి అభ్యర్థి రీకౌంటర్ ఇచ్చారు. శ్రీరాములు అందరివాడు అని, అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్టకు అని మతాల వారు వచ్చారని గుర్తు చేశారు. అప్పుడు రేషన్ బియ్యాన్ని అక్షింతులు మార్చి ఉంటే ప్రభుత్వంలో బిఆర్‌ఎస్ ఉంది కదా? అప్పుడు గుడి గాడిదల పండ్లు తోముతున్నారని విమర్శలు గుప్పించారు. అధికారం కోల్పోవడంతో పాటు ఎండలో తిరిగితే ఎండదెబ్బ తగిలి కెసిఆర్, కెటిఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాముడి పట్ల కెటిఆర్‌కు ఏహ్య భావం ఉందని,  రాము పేరు తీస్కొని నాస్తికుడు అని పెట్టుకోవాలని సూచించారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన మీకు అక్షింతలు ఎక్కడ కలిపారో తెలియడం లేదా? అని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News