అమరావతి: కడప ఎంపి అవినాష్ రెడ్డిని చిన్నపిల్లోడు, అమాయకుడని సిఎం జగన్ అంటున్నారని ఎపిసిసి ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. అవినాష్ అమాయకుడని రవీంద్రనాథ్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ చెబుతున్నారని, వీళ్లను అమాయకులంటే ఎవరైనా నమ్ముతారా? అని అడిగారు. హత్య కేసులో సాక్ష్యాలు తుడిచేస్తుంటూ అవినాష్ మౌనంగా ఎందుకు ఉన్నారని ధ్వజమెత్తారు. వైఎస్‌ఆర్ కడప జిల్లా కమలాపురంలో ఎపిసిసి ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు. కడప స్టీల్ ప్లాంట్‌పై పార్లమెంట్‌లో అవినాష్ ఒక్కసారైనా మాట్లాడారా? అని షర్మిల ప్రశ్నించారు. వివేకా హత్య జరిగిన రోజు ఎవరో చంపారో తమకు కూడా తెలియదని, సిబిఐ అధికారులు చెప్పిన తరువాతనే అవినాష్ హస్తం ఉందని తెలిసిందని, హత్య చేసిన వాళ్లతో అవినాష్ కలిసి ఉన్నట్లు సాక్ష్యాలను సిబిఐ అధికారులు బయటపెట్టారని, అవినాష్ ఎవరెవరితో మాట్లాడారో ఫోన్ కాల్ రికార్డులు స్పష్టం చేశాయని, రూ.40 కోట్లు డబ్బులు చేతులు మారాయని ఆధారాలు చూపుతున్నాయని, ఇన్ని సాక్ష్యాలున్న ఐదేళ్లుగా అవినాష్‌పై ఒక్క చేయి కూడా పడలేదు ఎందుకు అని నిలదీశారు. సాక్షాత్తూ ఎపి ముఖ్యమంత్రి జగన్ అధికారం అడ్డం పెట్టి అవినాష్‌ను కాపాడుతున్నారని ఆరోపణలు చేశారు. అవినాష్‌ను అరెస్టు చేసేందుకు కర్నూలుకు సిబిఐ అధికారులు వెళ్తే అడ్డుకున్నారని షర్మిల దుయ్యబట్టారు.
వీళ్లను అమాయకులంటే ఎవరైనా నమ్ముతారా?: షర్మిల
- Advertisement -
- Advertisement -
- Advertisement -