Monday, December 23, 2024

వైశాఖ అమావాస్య గురించి తెలుసుకోండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నేడు వైఖాఖ అమావాస్య. ఈ రోజున పూర్వీకులకు మొక్కులు చెల్లించడం జరుగుతుంది. అయితే వైశాఖ అమావాస్యను పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, గృహ ప్రవేశం వంటి వాటికి శుభ దినంగా మాత్రం పరిగణించరు. అందుకే వాటిని చేయరు.  ఈ రోజు కేవలం పూర్వీకులకు అంకితమైనది. పితృ పూజ, గంగా స్నానం, జంతువులకు మేత వేయడం వంటివి ఈనాడు చేస్తారు.

దృక్ పంచాంగం ప్రకారం అమావాస్య తిథి నేడు(మే 07) ఉదయం 11.40 గంటలకు మొదలయి రేపు (మే 08) ఉదయం 8.51 కి ముగుస్తుంది.  దీనిని నేడు(మే 07) దేశవ్యాప్తంగా పాటిస్తున్నారు.

నేడు జనులు వేకువ జాముననే లేచి పవిత్ర స్నానం చేస్తారు. ఇంట్లో సాత్విక భోజనం వండుతారు. బ్రాహ్మణుడిని ఆహ్వానిస్తారు. చపాతిలు చేసి పశువులకు తినిపిస్తారు. బ్రాహ్మణులు పితృ తర్పణం  నిర్వహిస్తారు. బ్రాహ్మణుడికి డబ్బు, ఆహారం, బట్టలు అందజేస్తారు. కుటుంబంలోని పురుషులు వారి పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ రోజున యజ్ఞం కూడా చేస్తుంటారు. పితృ దోషాన్ని తొలగించుకోడానికి పితృ గాయత్రిని కూడా నిర్వహిస్తుంటారు. పితృ తర్పణం, పిండ దానం, పితృ పూజ ఆచరించడం వల్ల శాంతి, సంపద పెరుగుతుందని నమ్మకం. జనులు రిషికేశ్, హరిద్వార్ లేక ప్రయాగ వంటి పుణ్య క్షేత్రాలకు వెళ్లి గంగా నదిలో మునక వేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News