Tuesday, September 17, 2024

హైదరాబాద్‌లో 3 గంటల పాటు మెట్రో రైళ్లకు అంతరాయం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: గ్రేటర్‌లో కురిసిన భారీ వర్షానికి మంగళవారం మెట్రో సేవలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే మెట్రో స్టేషన్‌లలో ప్రయాణికులు భారీగా నిలిచిపోయారు. భారీగా కురిసిన వర్షానికి రోడ్లపై ట్రాఫిక్ జాం కావడంతో ప్రయాణికులు భారీగా మెట్రో స్టేషన్‌లకు చేరుకున్నారు. దీంతో అన్ని మెట్రో స్టేషన్‌లు ప్రయాణికులతో నిండిపోయాయి. మంగళవారం మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోవడంతో సాయంత్రం ఒక్కసారిగా వాతావరణ మారిపోయింది. ప్రధానంగా నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది.

ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో నగరం జలమయమైంది. మియాపూర్ నుంచి ఎల్‌బి నగర్ వరకు నగరం చుట్టూ భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలోనే రోడ్లపై నీరు నిలిచింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతోపాటు మెట్రో స్టేషన్లలో కూడా నీరు రావడంతో దాదాపు మూడు గంటల పాటు మెట్రో సర్వీసులను అధికారులను నిలిపివేశారు. దీంతోపాటు ఎస్కలేటర్‌లను, లిఫ్ట్‌లను మెట్రో అధికారులు ఆపివేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News