Sunday, January 19, 2025

భారతి… అలా జరగాలంటే… మిగిలిన వారిని గొడ్డలితో నరికేయండి: షర్మిల

- Advertisement -
- Advertisement -

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎపి కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్మలు చేస్తున్నారు. దీంతో జగన్ వర్సెస్ షిర్మిల మధ్య పొలిటికల్ వార్ నడుస్తోందని రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. సిఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై షర్మిల ఘాటు విమర్శలు చేశారు. లోక్ సభ, ఎపి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమె రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేపట్టారు. ఎప్పుడు ఒక్కరే కడపలో గెలవాలనేది వైఎస్ భారతి ప్లాన్ అయి ఉంటుందని, మిగితా వాళ్లను గొడ్డలితో నరికేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కడప వైఎస్‌ఆర్‌సిపి ఎంపి అభ్యర్థి అవినాష్ రెడ్డి దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని షర్మిల ఆరోపణలు చేశారు. వైఎస్‌ఆర్‌సిపి ఓడిపోతే అవినాష్ రెడ్డి అరెస్టు ఖాయమని, భయంతోనే అతడు పాస్‌పోర్టులు రెడీ చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. కడపలో అవినాష్ రెడ్డి గెలిస్తే నేరం గెలిచినట్లేనని తెలిపారు. కడప ప్రజలకు అందుబాటులో ఉంటానని, తనకు ఓటు వేసి గెలిపించాలని వైఎస్ షర్మిల విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News