హైదరాబాద్: ఎన్నికలు దగ్గర వేళ కాంగ్రెస్ పార్టీ స్వీడ్ పెంచింది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం రాష్ట్రానికి రానున్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న రెండు బహిరంగ సభల్లో రాహుల్ పాల్గొనున్నారు. సాయంత్రం 4 గంటలకు నర్సాపూర్, సాయంత్రం 6 గంటలకు ఎల్బీనగర్ జనజాతర ర్యాలీలలో ప్రసంగించనున్నారు. ఎల్బీ నగర్ ఇండోర్ స్టేడియంలో సభకు రాహుల్ హాజరుకానున్నారు.
ఈ సభకు రాహుల్ తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ముఖ్యనేతలు హాజరుకానున్నారు. నాల్గవ దశ పోలింగ్‌కు ముందు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మే 10న భువనేశ్వర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ కూడా రోడ్‌షో నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఒడిశా రాష్ట్రంలో ప్రధాని కార్యక్రమానికి భద్రతా ఏర్పాట్లు చేశారు. అంతకుముందు మే 8న విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కలిసి ప్రధాని మోదీ రోడ్‌షో నిర్వహించారు.