Friday, December 20, 2024

అమెరికాలో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్

- Advertisement -
- Advertisement -

అగ్రరాజ్యం అమెరికాలో మరో తెలంగాణ విద్యార్థి మిస్ అయ్యాడు. తెలంగాణ రాష్ట్రం హన్మకొండకు చెందిన రూపేష్ చంద్ర చికాగోలో ప్రస్తుతం విస్కాన్సిన్​లోని కాంకార్డియా యూనివర్సిటీలో మాస్టర్స్​ చదువుతున్నాడు. అతను మే 2 తేదీ నుంచి కనిపించకుండాపోయాడు. చివరిగా మే 2న మధ్యాహ్నం కొడుకుతో వాట్సప్ కాల్ మాట్లాడినట్లు రూపేష్ తండ్రి తెలిపాడు. ఆ సమయంలోనే ఫోన్ స్విచ్ఛాప్‌ అయిందని తెలిపాడు.

కుటుంబ సభ్యులు అతని రూం మేట్స్ తో మాట్లాడిన ఫలితం లేకుండా పోయింది. ఎవర్నో కలవడానికి వెళ్లాడని వారు ఎవరో తమకు తెలియదని అతని స్నేహితులు తెలిపారు. రూపేప్ చంద్ర అదృశ్యమైనట్లు తల్లిదండ్రులు చికాగో పోలీసులకు సమాచారం అందించారు. అమెరికా ఎంబసీని కూడా సంప్రదించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం రంగంలోకి దిగిన అధికారులు రూపేష్ చంద్ర కోసం గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News