- Advertisement -
ఐపిఎల్ 17వ సీజన్ లీగ్ దశ చివరి అంకానికి చేరుకుంది. ఇంకా 13 మ్యాచ్ లే మిగిలి ఉన్నాయి. ఇప్పటివరకైతే ఏ జట్టూ ప్లేఆఫ్స్ దశకు అర్హత సాధించలేదు. నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ పై విజయం సాధించడంతో ముంబై ఇండియన్స్ అఫీషియల్ గా టోర్ని నుంచి వైదొలిగింది. ఈ సీజన్ లో టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిన తొలి జట్టు ముంబై ఇండియన్స్.
ప్రస్తుతం చెరో 12 పాయింట్లతో కొనసాగుతున్న లక్నో, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఓ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలిచినా వారి పాయింట్లు 14 అవుతాయి. కాగా మిగతా తొమ్మిది జట్లు ఇంకా ప్లే ఆఫ్స్ రేసులోనే ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ దశకు చేరడం ఖాయమనిపిస్తోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ప్లే ఆఫ్స్ కు చేరువలో ఉంది.
- Advertisement -