Thursday, January 23, 2025

సాయిపల్లవి బర్త్ డే స్పెషల్ వీడియో

- Advertisement -
- Advertisement -

చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ’తండేల్’లో నాగ చైతన్య, సాయి పల్లవి అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, కెమిస్ట్రీతో ఆలరించబోతున్నారు. గీతా ఆర్ట్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో అత్యంత భారీ బడ్జెట్‌తో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

గురువారం సాయి పల్లవి పుట్టినరోజు. ఈ సందర్భంగా మేకర్స్ ఒక ప్రత్యేకమైన పుట్టినరోజు వీడియోను విడుదల చేశారు. వీడియో ప్రారంభంలో సాయి పల్లవి మునుపటి సినిమాల్లోని ఐకానిక్ పాత్రలను ప్రజెంట్ చేస్తోంది. ఆ తర్వాత ఆమెను తండేల్ బుజ్జి తల్లి (సత్య)గా పరిచయం చేశారు. ఇక క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో ’తండేల్’ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇవ్వబోతోంది. ప్రేమకథే కాకుండా ఈ సినిమాలో చాలా అంశాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News