Friday, January 3, 2025

కేజ్రీ, కవితలపై ఇడి మరో ఛార్జీషీట్ సిద్ధం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ త్వరలోనే మరో తాజా చార్జీషీట్ దాఖలు చేయనుంది. సంబంధిత మనీలాండరింగ్ వ్యవహారాలలో ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్లకుంట్ల కవిత ఇతర నిందితులపై మరిన్ని నేరాభియోగాలను పొందుపరుస్తూ ఈ ఛార్జిషీట్ దాఖలు చేస్తున్నట్లు అధికారవర్గాలు గురువారం తెలిపాయి. శుక్రవారమే కేజ్రీవాల్‌కు బెయిల్ ఇచ్చే విషయంలో సుప్రీంకోర్టు కీలక రూలింగ్ వెలువరించనుంది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్, కవితలపై తాజా ఛార్జీషీట్ దాఖలు ఈ కేసుకు సంబంధించి కీలక మలుపు కానుంది. ఈ మద్యం కేసులో పలువురు రాజకీయ నాయకులు నిందితులు అయ్యి, జైలు పాలయిన దశలో దేశవ్యాప్తంగా పలు సంచలనాలకు దారితీస్తోంది. కాగా తాజా ఛార్జీషీట్‌లో ఈసారి ఇడి ఏకంగా మొత్తం ఆమ్ ఆద్మీపార్టీనే నిందిత పాత్రలో చేర్చనుందని, ఈ క్రమంలో పార్టీకి చెందిన పలు ఆస్తులను అటాచ్ చేయనుందని వెల్లడైంది.

హైకోర్టులో కవిత బెయిల్ విచారణ నేడే
మనీలాండరింగ్ కేసులో నిందితురాలైన బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె కవిత బెయిల్ కోసం గురువారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణ శుక్రవారం (నేడు) న్యాయమూర్తి స్వర్ణ కాంత శర్మ ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణకు చేపడుతుంది. తనకు బెయిల్ నిరాకరిస్తూ ట్రయల్ కోర్టు వెలువరించిన రూలింగ్‌ను కవిత హైకోర్టులో సవాలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News