Friday, November 22, 2024

మజ్లిస్‌ను బి.సి.లు ఎదుర్కోగలవా?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో మజ్లిస్‌ను ఎ దుర్కొనే ధైర్యం బిఆర్‌ఎస్‌కు, కాంగ్రెస్ కు లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమి త్‌షా అన్నారు. రాష్ట్రంలో ఎబిసిలది త్రి కోణ బంధమని ఆయన సరికొత్త నిర్వచ నం ఇచ్చా రు. భువనగిరిలో గురువారం జరిగిన జనజాతర సభలో అమిత్ షా ప్రసంగించారు.ఈ క్రమంలో ఎబిసి అనే పదాలకు కొత్త అర్థాలు చెప్పారు. ఏ అం టే అసదుద్దీన్, బీ అంటే బీఆర్‌ఎస్, సీ అంటే కాంగ్రెస్ అని అమిత్ షా వెల్లడించిన ఆయన అసదుద్దీన్, బీఆర్‌ఎస్, కాం గ్రెస్ ముగ్గురు ఒకటేనని వారిపై తీవ్ర ఆ రోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 10 కంటే ఎక్కువ ఎంపీ సీట్లు గెలుస్తామ ని అమిత్ షా దీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు ఓట్ ఫర్ జిహాద్, ఓట్ ఫర్ అభివృద్ధి మధ్య జరుగుతున్న ఎన్నికలని అ న్నారు. కుటుంబ అభివృద్ధి, దేశవ్యాప్తం గా జరుగుతున్న అభివృద్ధికి మధ్య జరుగుతున్న పోరు అని , రాహుల్ పిల్ల చేష్ట ల హామీలు, మోడీ గ్యారంటీ మధ్య జరుగుతున్న ఎన్నికలని ఆయన పేర్కొన్నా రు. తెలంగాణలో బిజెపి 2019 ఎన్నిక ల్లో నాలుగు సీట్లు గెలిచింది. కానీ ఈ సారి 10 సీట్లు గెలవబోతున్నామని ధీ మా వ్యక్తం చేశారు. దేశంలో మూడు వి డతల్లో జరిగిన ఎన్నికల్లో ఇప్పటికే 200 సీట్లు గెలిచామని, మిగిలిన స్థానాల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 400 సీట్లు గెలుస్తామన్నారు.

కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇవ్వడంతో షెడ్యూల్ కులాలు, తెగల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బిజెపికి రాష్ట్రంలో పది సీట్లు ఇస్తే ముస్లింల రిజర్వేషన్ తొలగించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కేటాయిస్తామని అన్నారు. అంతేకాదు గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇచ్చిన రుణమాఫీ హామీ ఇప్పటివరకు అమలు కాలేదని కామెంట్స్ చేసారు. కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు ఎప్పటికీ అమలు చేయదని, కానీ ప్రధాని మోడీ చెప్పింది తప్పకుండా అమలు చేస్తారని కేంద్ర హో మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. రాహుల్ గాంధీ గ్యారంటీలు చెల్లే పరిస్థితి లేదని, రైతులకు ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ ఇప్పటి వరకు అమలు కాలేదని అన్నారు. అంతేకాకుండా రైతులకు ఏటా రైతు భరోసా కింద రూ.15 వేల ఆర్థికసాయం, రైతు కూలీలకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం నెరవేర్చలేదని, దాంతోపాటు వరి, గోధుమలకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిన హామీలను సైతం అమలు చేయలేదని ఎద్దేవా చేశారు.

రైతులకు పూచీ లేకుండా రూ.5 లక్షల రుణ హామీ నెరవేరలేదు. ప్రతి మండలంలో అంతర్జాతీయ పాఠశాల హామీ నెరవేర్చలేదు. కాంగ్రెస్ చేసిన వాగ్దానాలను ఏ ఒక్కటి కూడా నేరవేరదు ఎన్నటికీ నెరవేర్చదని అన్నారు. ఆర్టికల్ 370ని తొలగించి కశ్మీర్‌లో త్రివర్ణ పతాకం ఎగరేలా చేశామని అమిత్ షా గుర్తు చేశారు. మోడీ ఉగ్రవాదం, తీవ్రవాదం వంటి వాటిని రూపుమాపి దేశంలో మావోయిస్టు సిద్ధాంతాలు లేకుండా చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి బిజెపి అభ్యర్థి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ గతంలో ఎంపీగా అనుభవం ఉన్న వ్యక్తి, ఇక్కడి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన వ్యక్తి కాబట్టి ఆయన గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మోడీని మరోసారి ప్రధాని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర రావు, గూడూరు నారాయణ రెడ్డి, చందా మహేందర్ గుప్తా, వల్ధాస్ రాజు కాళ భైరవ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News