Monday, December 23, 2024

దండకారణ్యంలో కాల్పుల మోత

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో శుక్రవారం భద్రత బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కనీసం 12 మంది నక్సలైట్లు హతమైనట్లు ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి వెల్లడించారు. గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిడియా గ్రామ సమీపంలోని అడవిలోకి నక్సల్ వ్యతిరేక చర్యలపై భద్రత సిబ్బంది వెళ్లినప్పుడు రెండు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు పోలీసులు అంతకుముందు తెలిపారు. ‘గంగలూర్ ప్రాంతంలో కాల్పుల పోరు ముగిసింది. మన భద్రత బలగాలు భారీ విజయం సాధించాయి. ఇంత వరకు 12 మంది నక్సలైట్ల మృతదేహాలు వెలికితీశారు’ అని ముఖ్యమంత్రి విలేకరులతో చెప్పారు.

ఆయన ఈ సందర్భంగా భద్రత బలగాలకు, సీనియర్ అధికారులకు అభినందనలు తెలియజేశారు. గడచిన ఒక నెలలో ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లకు వాటిల్లిన మూడవ భారీ నష్టం ఇది. ఏప్రిల్ 16న కాంకెర్ జిల్లాలో ఎన్‌కౌంటర్‌లో కనీసం 29 మంది నక్సలైట్లు హతమయ్యారు. ఏప్రిల్ 30న నారాయణ్‌పూర్, కాంకెర్ జిల్లాల సరిహద్దు పొడవునా భద్రత బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పది మంది నక్సలైట్లు మరణించారు. రాష్ట్ర బస్తర్ ప్రాంతంలో వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఈ ఏడాది ఇంత వరకు 103 మంది నక్సలైట్లు హతమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News