Saturday, December 21, 2024

జాబ్ ఇంటర్వూకి వచ్చిన యువతిపై అత్యాచారం యత్నం

- Advertisement -
- Advertisement -

జాబ్ ఇంటర్వూకు వచ్చిన యువతిపై కంపెనీ ఎండి అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…హైదరాబాద్‌కు చెందిన యువతి అమీర్‌పేటలోని టెక్‌వ్యూ కంపెనీలో ఉద్యోగం ఇంటర్వూ కోసం వచ్చింది. కంపెనీ ఎండి నవీన్(36) దండోత్కర్ యువతి ఇంటర్వూ చేసి ఎంపిక చేశాడు. ఆఫీస్ సిమ్ కార్డు తీసుకోవాలని చెప్పాడు, తాను ఇంటి వద్ద ఉన్నానని వచ్చి కలెక్ట్ చేసుకోవాలని చెప్పాడు.

దీంతో యువతి నవీన్ ఇంటికి వెళ్లింది, అక్కడ జాబ్ గురించి వివరించిన నవీన్ తర్వాత యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. అక్కడి నుంచి తప్పించుకన్న యువతి ఇంటికి వచ్చింది. తల్లిదండ్రుల సాయంతో మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మాధవి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News