Tuesday, April 1, 2025

చెన్నైకి గుజరాత్ షాక్

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్‌లో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్‌లు అద్భుత సెంచరీలతో కదంతొక్కారు. చెలరేగి ఆడిన సుదర్శన్ 51 బంతుల్లోనే ఏడు భారీ సిక్సర్లు, ఐదు ఫోర్లతో 103 పరుగులు చేశాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అలరించిన గిల్ 55 బంతుల్లోనే 6 సిక్సర్లు, 9 బౌండరీలతో 104 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ఇద్దరు తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 210 పరుగులు జోడించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News