Sunday, January 19, 2025

ప్రియుడుపై ప్రియురాలు పెట్రోల్ పోసి తగలబెట్టి… కొనఊపిరితో ఇద్దరు

- Advertisement -
- Advertisement -

చెన్నై: తనకు దక్కని ప్రియుడు మరొకరికి దక్కకూడదని అతడిపై ప్రియురాలు పెట్రోల్ పోసి తగలబెట్టిన అనంతరం ఆమె కూడా  పెట్రోల్ పోసుకొని తగలబడిన సంఘటన తమిళనాడు రాష్ట్రం వేళచ్చేరి ప్రాంతంలో జరిగింది. ఇద్దరు ఆస్పత్రిలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మైలాడుదురై ప్రాంతానికి చెందిన ఆకాశ్ అనే యువకుడు(24) డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. చిదంబరం ప్రాంతానికి చెందిన సింధూజ(22) అనే యువతి మైలాడుదురైలో బిఎ సెకండియర్ చదువుతోంది. ఇద్దరు బస్టాండులో కలుసుకోవడంతో పరిచయం ఏర్పడింది.
పరిచయం ప్రేమగా మారింది. యువకుడు మరో యువతి మాట్లాడుతుండడంతో అతడిపై ప్రియురాలు పగ పెంచుకుంది. ఇద్దరు మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో కలుసుకుందామని అతడిని సింధూజ ఫోన్ చేసింది. ఇద్దరు కలిసి బైక్ పై పూంపుహార్ కు వెళ్లారు. ఇద్దరు అక్కడ గొడవ జరగడంతో మైలాడుదురై బస్టాండ్ తీసుకొచ్చి వదిలిపెట్టాడు. బైక్ దిగగానే ఆమె పెట్రోల్ బాటిల్ తీసి అతడిపై పోసి తగలబెట్టింది. ఆమె కూడా పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంది
ప్రయాణీకులు వెంటనే గమనించి మంటలను ఆర్పేసి ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మైలాడుదురై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News