Monday, December 23, 2024

బాలికను నరికి… చెట్టుకు ఉరేసుకున్న పెళ్లి కుమారుడు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: బాలిక తనకు ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో జరుగుతున్న నిశ్చితార్థాన్ని వారు ఆపేశారు. దీంతో బాలికపై పగ పెంచుకున్న పెళ్లి కుమారుడు ఆమె తల నరికి అనంతరు అతడు చెట్టుకు ఉరేసుకున్న సంఘటన కర్నాటకలోని మడికేరి ప్రాంతంలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కొడుగు జిల్లా సుర్లబ్భి గ్రామానికి చెందిన మీనా(16) కుటుంబ సభ్యులు అదే గ్రామానికి చెందిన ప్రకాశ్(32) అనే యువకుడితో పెళ్లి నిశ్చయం చేశారు.
బాలికకు ప్రకాశ్ ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో స్థానికుల సహకారంతో శిశు మహిళా సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చింది.

శిశు సంక్షేమ అధికారులు నిశ్చితార్గం జరిగే స్థలానికి చేరుకొని ఆపేశారు. బాలిక తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పెళ్లిని వారు రద్దు చేసుకున్నారు. దీంతో బాలికపై ప్రకాశ్ పగ పెంచుకున్నాడు. బాలిక ఇంట్లోకి చొరబడి ఆమె తల్లిదండ్రులపై దాడి చేసి అనంతరం బాలిక అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లాడు. బాలికను హత్య చేసిన అనంతరం మొండెం, తలను వేరుచేశారు. మొండాన్ని అక్కడే వదిలేసి తలతో పారిపోయాడు. హత్య జరిగిన ప్రదేశం నుంచి మూడు కిలో మీటర్ల దూరంలో అతడు చెట్టుకు ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News