Sunday, January 19, 2025

సర్జికల్స్ స్ట్రైక్స్ ఎలా నమ్మాలి అని రేవంత్ ప్రశ్నిస్తున్నారు: బండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కరీంనగర్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడానని కరీంనగర్ బిజెపి ఎంపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కరీంనగర్ లో నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేశానని, రైతులకు ఇబ్బందులు వస్తే అండగా నిలబడ్డానని వివరించారు. కరీంనగర్ లో జరిగిన ర్యాలీలో బండి ప్రసంగించారు. కేంద్ర నిధులు తీసుకవచ్చి అభవృద్ధి పనులు చేపట్టాలని, కరీంనగర్ అభివృద్ధి చెందాలంటే బిజెపిని గెలిపించాలని బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. కేంద్రంలో మరోసారి నరేంద్ర మోడీని గెలిపించాలని, దేశ ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకోకుండా ప్రజలు చూడాలని, ప్రజల ఓటు రామబాణంగా మారి ఢిల్లీకి వెళ్లాలని, సర్జికల్ స్ట్రైక్స్ ను ఎలా నమ్మాలని రేవంత్ ను ప్రశ్నిస్తున్నారని, రేవంత్ ను సరిహద్దులకు తీసుకెళ్తే జవాన్లే చెబుతారని, జవాన్ల త్యాగాలను అబాసుపాలు చేస్తున్నారని బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News