Monday, January 20, 2025

పక్కాగా10 మావే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భారతీ య జనతా పార్టీ (బిజెపి) పది లోక్ సభ స్థానాల్లో పక్కాగా వి జయం సాధిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ధీమా వ్య క్తం చేశారు. మరో సీటును కూడా గెలుచుకుని 11 స్థానాల్లో గె లుపు అవకాశం ఉందని పేర్కొన్నారు. కేంద్రంలో మోడీ నాయకత్వంలో బిజెపి మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన జరిగే సమయానికి మి గులు బడ్జెట్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అప్పులపాలయ్యిందని అమిత్ షా విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచా రం ముగించుకుని హైదరాబాద్ వచ్చిన అమిత్ షా శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగా ణ రాష్ట్రంలో అప్పులు చేయడంలో గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పోటీ  పడుతోందని ఎద్దేవా చేశారు.

ఇప్పటి వరకు జరిగిన మూడు దశల ఎన్నికల్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు దాదాపు 200 సీట్లలో విజయం సాధిస్తాయని అన్నారు. మూడు దశల్లో కన్నా నాలుగో దశలో బిజెపి మరిన్ని స్థానాల్లో విజయం సాధించి దాదాపు 400 స్థానాల్లో బిజెపి గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మోడీ నాయకత్వంలో మరోసారి కేంద్రంలో బిజెపి అధికారంలోకి రావడాన్ని మనమంతా చూడబోతున్నామని అన్నారు. తెలంగాణలో బిజెపికి ఆదరణ రోజు రోజుకీ పెరుగుతోందని చాలా స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ స్టీరింగ్ ఇప్పటికీ ఓవైసీ చేతిలోనే ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒక్కటీ కూడా అమలు కాలేదని విమర్శించారు. హస్తం పార్టీ నేతలు మహిళలకు నెలకు రూ.2500, రైతుభరోసా కింద రూ.15 వేలు, కౌలు రైతులకు రూ.15 వేలు, విద్యార్థులకు రూ.5 లక్షల రుణాలు ఇస్తామన్నారని అమిత్‌షా గుర్తు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మళ్లీ ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తారని, ట్రిపుల్ తలాక్‌ను కూడా తీసుకొస్తారని అమిత్‌షా ఆరోపించారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. బిజెపి గెలుపును ఎలా అడ్డుకోవాలో తెలియక తన వీడియోను ఎడిట్ చేసి తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామని తాను చెప్పినట్లుగా ఫేక్ వీడియో సృష్టించి దానిని వైరల్ చేసి కాంగ్రెస్ లబ్దిపొందాలని యత్నిస్తోందని ఆరోపించారు. బిజెపి కేంద్రంలో అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని కాంగ్రెస్ పార్టీ ఒక అబద్దపు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని మార్చడం, రిజర్వేషన్లు తొలగించడం వంటివి రెండూ జరగవని అమిత్‌షా మరోసారి స్పష్టం చేశారు. మైనార్టీలకు ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్లు తొలగించి బీసీలకు ఇస్తామని ఆయన పునరుద్ఘాటించారు. ఈ ఎన్నికల్లో అవీనితి పార్టీ కాంగ్రెస్ ఒకవైపు, బీజేపీ ఒకవైపు ఉందని వ్యాఖ్యానించారు. మోదీని మూడోసారి ప్రధానమంత్రిని చేయడానికి దేశమంతా సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో గత బీఆర్‌ఎస్ అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ చర్యలు చేపట్టలేదని విమర్శించారు.

మోదీ ప్రధానిగా ఉంటేనే దేశం సురక్షితంగా ఉంటుందని దేశ ప్రజలు భావిస్తున్నారని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజుల్లో దేశంలో ఎన్నో చోట్ల ఉగ్రవాద బాంబు పేలుళ్లు జరిగేవని, మోదీ పాలన వచ్చాక ఉగ్రవాద దాడులు కనిపించకుండా పోయాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ తెలంగాణ రాష్ట్రానికి రామగుండం ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నిర్మించామని, సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీని మంజూరు చేశామని అమిత్‌షా వివరించారు. దీంతో పాటు ఎన్నో కీలక సంస్థలను కూడా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News