Saturday, November 16, 2024

మియాపూర్ ఈహెచ్‌టి సబ్ స్టేషన్‌లో కాలిపోయిన వైర్లు

- Advertisement -
- Advertisement -

కైత్లాపూర్, మియాపూర్ 132/33 కేవి సబ్ స్టేషన్ వైర్లు అనుమానస్పద రీతిలో దహనమైన సంఘటన మియాపూర్ సబ్ స్టేషన్‌లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న దక్షిణ డిస్కాం సిఎండి ముషారఫ్‌ఫరుఖీ, మాదాపూర్ డిసిపి వీనిత్, విద్యుత్ ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌పిడిసిఎల్ సిఎండి ముషారఫ్ ఫారుఖి మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని తెలిపారు. అధికారులు, విద్యుత్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సబ్ స్టేషన్లు, పిటిఆర్‌ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు.

మియాపూర్‌లోని 220 కేవీ ఈహెచ్‌టి సబ్ స్టేషన్‌లోని రాయదుర్గ్, మియాపూర్ 220 కేవీ కేబుల్ అనుమానస్పదరీతిలో కాలిపోయింది. దీంతో కైత్లాపూర్, మియాపూర్ 132/33 కేవి సబ్ స్టేషన్లకు కొంత సమయం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. విధుల్లో ఉన్న సిబ్బంది వెంటనే అప్రమత్తమై ప్రత్యామ్నాయ సర్కూట్ ద్వారా విద్యుత్‌ను సరఫరా చేశారు. నగరంలో అత్యధిక డిమాండ్ 4,350 మెగావాట్లకుపైగా ఉన్నప్పుడు కూడా కేబుల్స్‌లో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఉదయం అతితక్కువ డిమాండ్ ఉన్న సమయంలో కేబుల్స్ దహనం కావడంపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్ కో సిఎండి రిజ్వీ పోలీస్ విచారణకు ఆదేశించారు. సబ్‌స్టేషన్‌ను ట్రాన్స్‌కో డైరెక్టర్ జగత్‌రెడ్డి, ఫైర్ అధికారులు సందర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News