Saturday, November 16, 2024

తెరుచుకున్న బద్రీనాథ్ గుడి తలుపులు

- Advertisement -
- Advertisement -

ఉత్తరాఖండ్‌లో గఢ్వాల్ హిమాలయాల్లో గల బదరీనాథ్ ఆలయం ద్వారాలు భక్తుల కోసం ఆదివారం తిరిగి తెరచుకున్నాయి. శీతాకాలంలో మూసివేసిన తలుపులు ఆరు నెలల తరువాత తిరిగి తెరచుకున్నాయి. ఆలయం పునఃప్రారంభంతో బదరీనాథ్, కేదార్‌నాథ్, యమునోత్రి, గంగోత్రిలకు చార్‌ధామ్ యాత్ర మొదలైంది. ఆరు మాసాల అనంతర వేద మంత్రోచ్చారణలు, పూజ, ధోల్‌లు, నాగరా ధ్వనుల మధ్య బదరీనాథ్ ఆలయం తలుపులు తెరచినట్లు అధికారులు వెల్లడించారు. ఆలయాన్ని 15 క్వింటాళ్ల పుష్పాలతో అలంకరించారు. వర్షం కురుస్తున్నప్పటికీ ఆ ఉత్సవాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు ఆలయం ప్రాంగణంలో సమీకృతం అయ్యారు. రెండు గంటల ఆచారాల అనంతరం ఆలయం తలుపులు తెరిచారు.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆలయం ప్రధాన అర్చకుడు రావల్ ఈశ్వర్ ప్రసాద్ నంబూద్రి, బదరీనాథ్ కేదార్‌నాథ్ ఆలయ కమిటీ చైర్‌పర్సన్ అజేంద్ర అజయ్, సభ్యులు, చమోలి జిల్లా మేజిస్ట్రేల్ హిమాంశు ఖురానా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆలయం తలుపులు తెరవడానికి ముందు పూజను గర్భగుడిలో నంబూద్రి నిర్వహించారు. కేదార్‌నాథ్, యమునోత్రి, గంగోత్రి ఆలయాల తలుపులను శుక్రవారం అక్షయ తృతీయ సందర్భంగా భక్తుల కోసం తెరిచారు. బదరీనాథ్‌లక్ష దర్శనంకోసం శనివారం సాయంత్రం 4 గంటల వరకు 737885 మంది భక్తులు ఆన్‌లైన్ తమ పేర్లు నమోదు చేసుకున్నారనిఅధికార డేటా తెలియజేసింది. నిరుడు 1839591 మంది భక్తులు ఆలయాన్ని సందర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News