తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఓటర్ ఐడి కార్డుల పని పడింది. ఓటు హక్కును వినియోగించుకోవాలంటే ఓటర్ ఐడి అవసరం. ఒకవేళ మీవద్ద ఓటర్ ఐడీ లేకుండా చాలా ఈజిగా డిజిటల్ ఓటర్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ముందుగా కేంద్ర ఎలక్షన్ కమీషన్ అధికారిక వెబ్‌సైట్ https://voters.eci.gov.in/loginను ఓపెన్ చేయండి. ఈ వెబ్ సైట్‌లో మొబైల్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ కావాలి. మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తరువాత మొబైల్‌కి ఓటిపి వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే, పాస్‌వర్డ్ సెట్ చేసుకోమని అడుగుతుంది. అలా పూర్తి చేయగానే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. తర్వాత మీరు మొబైల్ నంబర్, పాస్‌వర్డ్, కాప్చా నంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత రిక్వెస్ట్ ఒటిపిపై క్లిక్ చెయ్యాలి. మీ మొబైల్ కి వచ్చిన ఓటిపిని ఎంటర్ చేసి, వెరిఫై, లాగిన్‌పై క్లిక్ చెయ్యాలి. ఇప్పుడు మీకు సైట్ లో కుడివైపు కింద మూలకు ఇఇపిఐసి డౌన్‌లోడ్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చెయ్యాలి. ఆ తరువాత ఎంటర్ ఇపిఐసి నెం అని కనిపిస్తుంది. అక్కడ మీ ఓటర్ ఐడీ కార్డుకి సంబంధించిన 10 అంకెల యునిక్ ఇపిఐసి నంబర్‌ను నమోదు చేయాలి.
తర్వాత సెలెక్ట్ స్టేట్‌లో మీ రాష్ట్రంని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెర్చ్ బాక్స్ క్లిక్ చెయ్యాలి. వెంటనే స్క్రీన్‌పై ఓటర్ ఐడికి సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. ఆ వివరాలు సరైనవే అని మీకు అనిపిస్తే, అప్పుడు మీరు కింద ఉన్న సెండ్ ఒటిపి క్లిక్ చెయ్యాలి. మీ మొబైల్ నంబర్‌కు ఓటిపి వస్తుంది, మొబైల్‌కి వచ్చిన ఓటిపిని ఎంటర్ చేసి, వెరిఫై బాక్స్ క్లిక్ చెయ్యాలి. ఆ తర్వాత మీకు పిడిఎఫ్ రూపంలో డిజిటల్ ఓటర్ ఐడి కనిపిస్తుంది. డిజిటల్ ఓటర్ ఐడి కార్డు కోసం డౌన్‌లోడ్ ఇఇపిఐసి క్లిక్ చెయ్యాలి. వెంటనే పిడిఎఫ్ ఫార్మాట్‌లో సేవ్ అవుతుంది. అలా డౌన్ లోడ్ చేసుకున్న ఫైల్ ను అవసరమైతే ప్రింట్ తీసుకోవచ్చు. లేమినేషన్ చేయించుకుని ఆధార్ కార్డ్ తరహాలో వాడుకోవచ్చు. లేదా మొబైల్‌లోనే సేవ్ చేసుకొని, అవసరమైనప్పుడు, ఎవరైనా అధికారులకు చూపించ వచ్చు. అయితే, డిజిటల్ ఓటర్ ఐడి కోసం మొబైల్ నంబర్‌ను ఓటర్ ఐడి కార్డుకు అనుసంధానం చేయడం తప్పనిసరి. అటువంటి పరిస్థితిలో వినియోగదారులు ముందుగా కెవైసి పూర్తి చేయాలి. అప్పుడు మీరు ఇ -ఓటర్ ఐడి కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.