Monday, December 23, 2024

ఖర్గే హెలికాప్టర్‌లో తనిఖీలు

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో ప్రతిపక్షాలను ఎన్నికల అధికారులు టార్గెట్ చేసి మరీ తనిఖీలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హెలికాప్టర్‌ను బీహార్ లోని సమస్తిపూర్‌లో పోలింగ్ అధికారులు తనిఖీ చేశారు. అయితే ఎన్డీయే కూటమి నేతలను మాత్రం ఎటువంటి తనిఖీలు చేయకుండా విడిచిపెడుతున్నారని ఎన్నికల అధికారులపై కాంగ్రెస్ ధ్వజమెత్తింది. శనివారం మల్లికార్జున్ ఖర్గే సమస్తిపూర్, ముజఫర్ పూర్ ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు.

ఇప్పటికే కేరళలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హెలికాప్టర్‌ను ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. శనివారం మల్లికార్జున్ ఖర్గేను సమస్తిపూర్‌లో అధికారులచే తనిఖీ చేయించారు అని ఎక్స్ వేదికగా కాంగ్రెస్ నేత రాజేష్ రాథోడ్ అన్నారు. బీహార్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఖర్గే హెలికాప్టర్ చెకె చేశారని రాజేష్ రాథోడ్ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. వీడియోలో హెలికాప్టర్ చుట్టూ అధికారులు , పోలీస్‌లు ఉండటం గమనించవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News