- Advertisement -
అమరావతి: అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఏపీలో పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పల్నాడు జిల్లాతో పాటు పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మాచర్లలో ఇప్పటికీ దాడులు జరగడం పోలీసుల వైఫల్యమేనని మండిపడ్డారు.
పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్ ల వద్ద నెలకొంటున్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్వించారు. శాంతిభద్రతలను కాపాడటంలో పోలీసులు విఫలమయ్యారని.. వెంటనే ఎన్నికల సంఘం పోలింగ్‌ను సమీక్షించి పరిస్థితిని చక్కదిద్దాలని చంద్రబాబా డిమాండ్ చేశారు.
- Advertisement -