Friday, December 20, 2024

ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది: సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి తప్పకుండా విజయం సాధిస్తామిన సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బిజెపికి ఓటేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరని.. దేశ వ్యాప్తంగా బిజెపి గ్రాఫ్ పడిపోతుందన్నారు. బీజేపీతో వచ్చేది లేదు సచ్చేది లేదని విమర్శించారు. సోమవారం ఓటు వేసిన అనంతరం మీడియాతో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని తెలిపారు. ఎన్డీఏ కూటమి పత్తా లేకుండా పోతుందని.. ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్ కూడా రాదని చెప్పారు.

ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. మోడీ.. ఈడీ, సీబీఐను నమ్ముకున్నారని విమర్శించారు. మోడీ వెనక అవినీతిపరులు ఉన్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాజ్యాంగం ఉంటుందని పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News