- Advertisement -
మల్కాజ్ గిరి: తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ఉదయం 7.00 గంటల నుంచి శాంతియుతంగా కొనసాగుతున్నాయి. ఓటర్లు మొదట కొద్ది సంఖ్యతో మొదలై ఇప్పుడు పెద్ద సంఖ్యలో ఓటింగ్ చేయడానికి వస్తున్నారు. దీనికి కారణం ఓటర్లలో వచ్చిన చైతన్యం అనే చెప్పాలి. ఓటర్ల స్లిప్పులు, తమ బూత్ లు చెక్ చేసుకోవడంలో ఓటర్లు కాస్త ఇబ్బంది పడుతున్నారు. పోలింగ్ స్టేషన్ల వెలుపల వివిధ పార్టీల ఏజెంట్లు కూర్చుని సాయపడుతున్నప్పటికీ అనేక మంది ఓటర్లు తమ సీరియల్ నెంబర్ తెలుసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. బూత్ లోకి వెళ్లాక ఒక్కో ఓటరు రెండు నిమిషాల్లో ఓటేసి బయటకు వచ్చేస్తున్నారు. ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు మల్కాజ్ గిరిలో దాదాపు 30 శాతం పోలింగ్ అయింది. అయితే మొగ్గు ఏ పార్టీ వైపు ఉందన్నది ఇప్పుడే చెప్పలేం.
- Advertisement -