Monday, January 20, 2025

గన్నవరం మండలంలో ఉద్రిక్తత..

- Advertisement -
- Advertisement -

కృష్ణాజిల్లాలో ఉద్రికత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. గన్నవరం నియోజకవర్గంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ముస్తాబాద్​ ప్లై ఓవర్​ వద్ద వల్లభనేని వంశీ, యార్లగడ్ద వెంకట్రావు వర్గీయులు కొట్టుకున్నారు.  ఒక వర్గంపై మరో వర్గంచెప్పులు.. రాళ్లు  రువ్వుకున్నారు.

ఈ సమయంలో వారిద్దరు వారి వారి కార్లలోనే ఉన్నారు. అయితే వారి అనుచరులు మాత్రం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. దీంతో ఇరు వర్గాల కార్యకర్తలు ఎవరి దారిన వారు వెళ్లిపోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News