Thursday, December 19, 2024

ముంబై ఎయిర్ పోర్టులో భారీగా గోల్డ్ సీజ్

- Advertisement -
- Advertisement -

ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున బంగారం పట్టుబడింది. గత మూడు రోజుల్లో విమానాశ్రయంలో జరిపిన తనిఖీల్లో రూ.13.56 కోట్ల విలువైన 22.14 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.

బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న 11మంది ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అక్రమ రవాణాపై 20 కేసులు నమోదయ్యాయని కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. నిందుతులను విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News