- Advertisement -
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు అయ్యింది. లోక్ సభ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ నియోజకవర్గంలోని పలు పోలింగ్ బూత్ లను మాధవీలత సందర్శించారు.ఈ క్రమంలో పోలింగ్ బూత్ లోకి బుర్ఖా వేసుకొని వచ్చిన ముస్లిం మహిళ ఐడీ ఫ్రూఫ్ చెక్ చేశారు.
ముస్లిం మహిళల హిజాబ్ తొలగించి ఓటర్లను చెక్ చేశారు. దీంతో మాధవీలత అనుచితంగా ప్రవర్తించారని ఆమెపై మలక్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, హైదరాబాద్ నియోజకవర్గం పరిధిలోని పలువురు హిందువుల ఓట్లు తొలగించారని మాధవీలత ఆరోపించారు.
- Advertisement -