Monday, December 23, 2024

బెంగాల్, ఆప్ర. లో ఎన్నికల ఘర్షణలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: లోక్ సభ నాలుగో దశ ఎన్నికలు చాలా వరకు ప్రశాంతంగానే జరుగుతున్నాయి. కానీ పశ్చిమ బెంగాల్, ఆంధ్ర ప్రదేశ్ లలో మాత్రం వైరి పక్షాలు హింసాత్మక ఘటనలకు దిగాయి. లోక్ సభ నాలుగో దశ ఎన్నికలు 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 96 సీట్లకు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి.

పశ్చిమ బెంగాల్ లో టిఎంసి కార్యకర్త క్రూడ్ బాంబ్ దాడిలో చనిపోయాడు. ఇది బోల్ పూర్ నియోజకవర్గంలో జరిగింది. ఎన్నికలు మొదలవ్వడానికి కొన్ని గంటల ముందే ఇది చోటుచేసుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో వైఎస్. జగన్ మోహన్ రెడ్డి, ఎన్. చంద్రబాబు నాయుడు ఒకరిపై మరొకరు హింసాత్మక ఆరోపణలు చేసుకున్నారు. పల్నాడు, కడప, అన్నమయ్య జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News