Friday, December 20, 2024

హైదరాబాద్‌లో స్వల్ప ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎమ్‌ఐఎమ్ ఎంపి అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ, బిజెపి ఎంపి అభ్యర్థి మాధవీలత అనుకోకుండా ఎదురుపడ్డారు. ఈ ఘటన పాతబస్తీ బీబీ బజార్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇద్దరు అభ్యర్థులు తమ అనుచరులు, సెక్యూరిటీతో తమ తమ వాహనాల్లో వచ్చారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్త వాతావరణాన్ని తలపింపజేసింది. ఇరు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున నినాదాలు చేశారు.

మాధవీలతకు వ్యతిరేకంగా ఎంఐఎం కార్యకర్తలు, అసదుద్దీన్‌కు వ్యతిరేకంగా బిజెపి కార్యకర్తల నినాదాలతో మారుమోగింది. ఎటూ కదలనీయకుండా కార్యకర్తలు ఇద్దరు అభ్యర్థుల వాహనాలు చుట్టుముట్టారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇరు వర్గాలను నచ్చజెప్పి పరిస్తితిని శాంతింప జేశారు. భారీ బందోబస్తు మధ్య ఇద్దరు అభ్యర్థుల వాహనాలను అక్కడ నుంచి పంపించివేశారు. దీంతో జనం ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News