Monday, December 23, 2024

నా గెలుపు కోసం కష్టపడుతున్న చెల్లి:రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

తన సోదరి, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం ప్రశంసల వర్షం కురిపించారు. రాయబరేలిలో తన గెలుపు కోసం ప్రియాంక తీవ్రంగా శ్రమిస్తున్నారంటూ ఆయన పొడిడారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయబరేలి నియోజకవర్గ పరిధిలోని మహరాజ్ గంజ్ పట్టణంలో ఒక ఎన్నికల ప్రచారం సభలో రాహుల్ ప్రసంగిస్తూ ప్రియాక గాంధీని తన వద్దకు పిలిచి ప్రేమగా ఆమె బుగ్గలు నిమిరి ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. మీ అందరికీ ఓ విషయం చెప్పదలచుకున్నాను. నేను దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం సాగిస్తుంటే ఇక్కడ నా చెల్లెలు నా గెలుపు కోసం తన రక్తాన్ని, శ్వేదాన్ని చిందిస్తోంది అని రాహుల్ అన్నారు. కాగా.. రాహుల్ గాంధీ పెళ్లి గురించి ఒక ఓటరు అడిగిన ప్రశ్నకు ప్రియాంక సభా వేదికపైనుంచే సమాధానమిస్తూ త్వరలోనే రాహుల్‌కు వివాహం చేయాల్సి ఉంది అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News