మనతెలంగాణ/హైదరాబాద్ : దే శంలో ప్రాంతీయ పార్టీలు కీలక పా త్ర పోషించే అవకాశం ఉందని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ అ న్నా రు. సిద్దిపేట జిల్లాలోని చింతమడక లో కెసిఆర్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.అనంతరం కెసిఆర్ మీడియాతో మాట్లాడు తూ, రాష్ట్రంలో పోలింగ్ బాగా జరుగుతోందని,65- శాతానికి మించి పోలింగ్ జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇండియా కూటమిలో చేరతారా..? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు కెసిఆర్ సమాధానమిస్తూ ఎన్నికల అనంతరం ప్రకటించే ఫలితాలలో కాంగ్రెస్, బిజెపి కూటములకు సరైన మెజార్టీ రాదని చెప్పారు. బిజెపిని సొంత నిబంధనల ప్రకారం 75 సంవత్సరాల వయస్సు తర్వాత ఎవరూ ఏ పదవిని చేపట్టరని, కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ కూడా తప్పుకోవాలని అన్నారు. ఇప్పుడు భారతదేశంలో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర అని,అందులో ఎలాంటి సందేహం లేదని తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల్లో గొప్ప ఫలితాలు వస్తాయి :కెటిఆర్
ఈ ఎన్నికల్లో అద్భుతమైన పోరాటపటిమ ప్రదర్శించిన క్షేత్రస్థాయి భారత రాష్ట్ర సమితి శ్రేణులందరికీ, పార్టీ నాయకులకు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఎదురుదెబ్బలు ఎన్ని కొట్టావు అన్నది కాకుండా ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా సవాళ్లు ఎదుర్కొని తిరిగి నిలబడి పోరాటం చేశామన్నదే ముఖ్యం అన్న నానుడిని నిజం చేసిన పార్టీ కార్యకర్తలను అభినందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత తిరిగి బలంగా నిలబడి కొట్లాడడం ఆషామాషీ వ్యవహారం కాదని, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అద్భుతమైన నిబద్ధతతో పార్టీ అధ్యక్షులు కెసిఆర్ వెంట నడిచి, ఎన్నికల్లో ప్రజామోదం కోసం కొట్లాడిన తీరు అద్భుతం అని పేర్కొన్నారు.
గత ఐదు నెలలుగా సామాజిక మాధ్యమాల్లో పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్క సోషల్ మీడియా వారియర్‌కి ఈ సందర్భంగా కెటిఆర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తమ పార్టీ సోషల్ మీడియా వారియర్లకు, కార్యకర్తలకు ఇతర పార్టీల మాదిరి ఎలాంటి చెల్లింపులు చేయకుండా పార్టీ మీద, తెలంగాణ మీద ప్రేమతో పనిచేశారని కొనియాడారు. కేవలం తెలంగాణ మీద ఉన్న ప్రేమ, కెసిఆర్ పైన ఉన్న అచెంచలమైన విశ్వాసంతో తమ పార్టీ కార్యకర్తలు ఈ ఎన్నికల్లో తమ వాణిని బలంగా వినిపించి, అద్భుతంగా కొట్లాడారని అన్నారు. తమ పార్టీ శ్రేణులు చేసిన ఈ పోరాటం గొప్ప ఫలితాలను ఇస్తుందని కెటిఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో పాటు తమ వెంట నిలిచిన తెలంగాణ ప్రజలందరికీ కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు.