- Advertisement -
ఎపిలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఉద్రిక్తతలు, దాడులు, హింసాత్మక ఘటనల నడుమ ముగిసింది. సాయంత్రం 6 గంటలకు ఇంకా క్యూలో నిలబడ్డ వారికి మాత్రం ఓటు వేసే అవకాశాన్ని అధికారులు కల్పించారు. అయితే, రాష్ట్రంలో భారీగా పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. నిన్న అర్థరాత్రి వరకు 78.25 శాతం పోలింగ్ జరిగిందని తెలిపారు. మంగళవారం పూర్తి పోలింగ్ శాతాన్ని వెల్లడించారు.
కాగా, రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పోలింగ్ జరగగా..120కి పైగా ఉద్రిక్త ఘటనలు చోటు చేసుకున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతల దాడులు, ప్రతిదాడులతో యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. పలు చోట్ల హింసాత్మక దాడులపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడులకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే, రాష్ట్రంలో ఎక్కడ కూడా రీపోలింగ్ చేయనవసరం లేదని ఈసీ పేర్కొంది.
- Advertisement -