Monday, December 23, 2024

కుర్కురే తేనందుకు భర్తకు విడాకులివ్వడానికి సిద్ధమైన భార్య

- Advertisement -
- Advertisement -

ఆగ్ర: ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. కుర్కురే ప్యాకెట్ తినడానికి తేనందుకు భర్తకు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడిందో భార్య. ఆమె భర్త రోజు రూ. 5 పెట్టి కుర్కురే ప్యాకెట్ తెచ్చి ఇస్తుంటాడు. ఆమెకేమో తిండి యావ ఎక్కువ. కుర్కురే ప్యాకెట్ విషయం చిన్నదే అయినప్పటికీ వారి మధ్య దాని విషయమై తీవ్ర వాదోపవాదాలు జరిగాయి.

ఆమె కోపంతో భర్తను వదిలేసి పుట్టింటికి కూడా వెళ్లిపోయింది. అంతేకాదు తన వివాహ బంధాన్ని తెంచుకునేందుకు స్థానిక పోలీసు అధికారుల వద్దకు కూడా పోయింది. విడాకులు కావాలని వాదించింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు పరిష్కారం కోసం ఫ్యామిలీ కౌన్సెలింగ్ కు రిఫర్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News