- Advertisement -
న్యూడిల్లీ: ఐపిఎల్‌లో భాగంగా మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 19 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో ఓడిన లక్నో ప్లేఆఫ్ అవకాశాలను క్లిష్టంగా మార్చుకుంది. ఈ సీజన్‌లో చివరి లీగ్ మ్యాచ్ ఆడిన ఢిల్లీకి ఇది ఏడో విజయం కావడం గమనార్హం. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ పొరెల్ (58), షాయ్ హోప్ (38), కెప్టెన్ పంత్ (33) పరుగులు చేశారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన స్టబ్స్ 4 సిక్స్‌లు, 3 ఫోర్లతో 25 బంతుల్లోనే అజేయంగా 57 పరుగులు చేశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. నికోలస్ పూరన్ (61), అర్షద్ ఖాన్ 58 (నాటౌట్)లు రాణించినా ఫలితం లేకుండా పోయింది.
- Advertisement -