Saturday, December 21, 2024

ప్రధాని మోడీపై కమడియన్ పోటీ.. నామినేషన్ దాఖలు

- Advertisement -
- Advertisement -

దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కామెడియన్ శ్యామ్ రంగీలా పోటీ చేస్తున్నారు. మంగళవారం చివరిరోజున శ్యామ్ రంగీలా వారణాసిలో తన నామినేషన్ దాఖలు వేశారు. వేశారు. దట ఆయను నామినేషన్ కు అనుమతించలేనట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు విజయవంతంగా నామినేషన్ వేశానని సోషల్ మీడియా ద్వారా శ్యామ్ తెలిపాడు. ‘మీ సపోర్ట్‌తో విజయవంతంగా నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశా. నా ఎన్నికల భవిష్యత్తు ఎన్నికల అధికారుల చేతుల్లో ఉంది. ప్రజాస్వామ్యంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. రాబోయే మూడు రోజులు కీలకం’అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.

నిన్న ప్రధాని మోడీ కూడా వారణాసిలో నామినేషన్ వేశారు. వారణాసి నుంచి వరుసగా మూడోసారి మోడీ పోటీచేస్తున్నారు. వారణాసిలో మొత్తం 41 మంది నామినేషన్ వేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా అజయ్ రాయ్ ఎన్నికల బరిలో దిగుతున్నారు.

ఎవరీ శ్యామ్ రంగీలా?

రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌కు చెందిన శ్యామ్ రంగీలా(29) మిమిక్రీ ఆర్టీస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించి తన మిమిక్రీలతో వినోదం పంచుతున్నాడు. మోడీ, రాహుల్ గాంధీతోపాటు పలువురు రాజకీయ నాయకులను అనుకరించడంలో మంచి నేర్పరిగా పేరు తెచ్చుకున్నారు. ”ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్” అనే టీవీషోతో ఆయన పాపులర్ అయ్యారు. అయితే, కొద్దికాలంగా మోడీని ప్రశ్నిస్తూ పలు వీడియోలు చేశాడు. మోడీ విధానాలపై సైతం విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే లోక్ సభ ఎన్నికల్లో వారణాసిలో మోడీపై పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు శ్యామ్ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News