Friday, January 10, 2025

ఎపిలో 80.66 శాతం పోలింగ్ నమోదు

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో 80.66 శాతం పోలింగ్ నమోదు అయిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ 1.07 శాతం కలిపితే మొత్తం పోలింగ్ 81.73 శాతంగా ఉండొచ్చని ప్రాథమిక అంచనా వేశారు. తుది పోలింగ్ శాతాన్ని బుధవారం మధ్యాహ్నం వెల్లడించనున్నట్లు అధికారి తెలిపారు. కాగా రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ కలుపుకొని 2014లో 78.90 శాతం, 2019లో 79.80 శాతం మేర పోలింగ్ నమోదైంది.

కాగా, రాష్ట్రంలో మే 13వ తేదీన అసెంబ్లీ, లోక్ సభకు జరిగిన ఎన్నికలు రణరంగంగా మారాయి. పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వైసిపి, టిడిపి వర్గాలు కర్రలు, ఇనుప రాడ్లు, కత్తులతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి రెండు రోజులు దాటినా దాడులు మాత్రం ఆగడంలేదు. దీంతో పలు ప్రాంతాల్లో పోలీసులు సెక్షన్ 144 విధించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News