Friday, December 20, 2024

ఎపిలో తగ్గని హింస.. భూమా అఖిలప్రియ బాడీగార్డ్‌ పై దాడి.. పరిస్థితి విషమం

- Advertisement -
- Advertisement -

ఎపిలో ఎన్నికల చాటున పాత కక్ష్యలు హింసాత్మక ఘటనలకు దారి తీశాయి. ఎన్నికలు ముగిసినా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పల్నాడు, మాచర్లలో వైసిపి, టిడిపి శ్రేణులు దారుణంగా కొట్టుకున్నారు. దీంతో రక్తపాతం పారింది. తాజాగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టిడిపి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్‌ నిఖిల్‌పై హత్యాయత్నం జరిగింది.

కొందరు దుండగులు కారుతో నిఖిల్ ను ఢికొట్టారు. దీంతో కిందపడిపోయిన నిఖిల్ పై రాడ్డుతో దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన సిసిటవి ఫుటేజ్ వైరల్ అవుతోంది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నిఖిల్ ను చికిత్స కోసం నంద్యాలలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు, పలు సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. పలువురు రాజకీయ నేతలను హౌస్ అరెస్టు చేశారు. అడుగడుగునా పోలీసులు వాహనాలను జల్లెడపడుతున్నారు. పల్నాడు, జమ్మలమడుగు వంటి ప్రాంతాల్లో సెక్షన్ 144 విధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News