Friday, November 22, 2024

కాంగ్రెస్ నేతల దాడులపై స్పందించిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో బిఆర్‌ఎస్ నేతలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడులకు పాల్పడిన సంఘటనపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్పందించారు. కాంగ్రెస్ నేతలు చెప్పే ప్రేమను పెంచడం అంటే ఇదేనా అని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రశ్నించారు. అధికార దుర్వినియోగంతో ప్రత్యర్థులపై దాడులు చేస్తున్నారని, దాడులు, దుర్బాషల్లో పోలీసులు భాగస్వాములు కావడం సిగ్గుచేటు అని కెటిఆర్ విమర్శించారు.

అచ్చంపేట పట్టణంలో బిఆర్ఎస్ కౌన్సిలర్ బాలరాజు ఇంటి మీద కాంగ్రెస్ నేతలు దాడులకు పాల్పడ్డారు. పట్టపగలే కాంగ్రెస్ కార్యకర్తల బరితెగించారు. కాంగ్రెస్ నేతలు దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని నాగర్ కర్నూలు బిఆర్ఎస్ అభ్యర్థి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అని అడిగారు.

సోమవారం ఉదయం బిఆర్‌ఎస్ ఎంపిటిసి సంగన్న గ్రామస్థులకు ఓటరు స్లిప్పులు అందజేస్తున్న క్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆయనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గ్రామస్థులు కాంగ్రెస్ నేతలను అడ్డుకోవడంతో హత్యాయత్నం నుంచి సంగయ్య తప్పించుకున్నారు. సంగయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News