Monday, December 23, 2024

లారీని ఢీకొట్టిన బస్సు.. నలుగురు మృతి, 15మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిపై మదురాంతకం ప్రాంతంలో వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి ముందున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందుగా పూర్తిగా ధ్వంసమైంది.

ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో 15 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలనానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం చెంగల్‌పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు పడాలం పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News