Saturday, December 21, 2024

24న అగ్రివర్శిటీలో విత్తన మేళా

- Advertisement -
- Advertisement -

రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలనే ఉద్దేశంతో ఈ నెల 24వ తేదీన రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ‘విత్తన మేళా‘ నిర్వహించనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా విత్తన పంపిణీ చేస్తారు. అలాగే అదే రోజు వరంగల్, పాలెం, ఆదిలాబాద్, జగిత్యాల కేంద్రాల్లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాలతోపాటుగా, ఇతర కృషి విజ్ఞాన కేంద్రాల ప్రాంగణాల్లో విత్తన మేళాలు జరగనున్నాయి. వివిధ పంటలకు సంబంధించి నాణ్యమైన విత్తన రకాలు విక్రయానికి అందుబాటులో ఉంచడంతోపాటు రైతులకు పైర్ల సాగుకు సంబంధించిన సమగ్ర సమాచారంపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News