Saturday, December 21, 2024

బేగంపేట ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం

- Advertisement -
- Advertisement -

కారు అదుపు తప్పి బీభత్సం సృంష్టించిన సంఘటన బేగంపేట ఫ్లైఓవర్‌పై గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…వీరేంద్రకుమార్ జైన్, సుశీలజైన్, ప్రణయ్ కలిసి కారు నంబర్ డిఎల్ 5సిడి 4834 కారులో పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే కారు బేగంపేట ఫ్లైఓవర్‌పై అదుపు తప్పింది. డివైడర్‌పై నుంచి వెళ్లి ట్రావెల్ బస్సును ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. ట్రావెల్ బస్సులో ఉన్న డ్రైవర్ రవీంద్రబాబు, మణిబాబుకు గాయాలయ్యాయి. స్థానికులు బేగంపేట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. కారు బీభత్సానికి ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో పోలీసులు కారు, బస్సును అక్కడి నుంచి తరలించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News