Monday, December 23, 2024

టిజి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్‌లో రాష్ట్ర కోడ్‌గా టిఎస్ స్థానంలో టిజి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ప్రచురించిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఇక నుండి తెలంగాణ రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు టిఎస్ స్థానంలో రాష్ట్ర కోడ్‌గా టిజి పేరుతో ఉండే విధంగా రిజిష్ర్టేషన్లు చేయాలని నోటిపికేషన్‌లో పేర్కొంది. నోటిఫికేషన్ ప్రకారం సీరియల్ నెంబర్ 29ఏ, టిఎస్ కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కోసం వాహనాలపై రిజిస్ట్రేషన్ గుర్తు టిజిగా సవరించి కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News