Friday, December 20, 2024

ప్లే ఆఫ్స్‌కు సన్‌రైజర్స్

- Advertisement -
- Advertisement -

ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య గురువారం జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యింది. మ్యాచ్ వర్షార్పణం కావడంతో సన్‌రైజర్స్ ప్లేఆఫ్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. అంతేగాక కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు కూడా నాకౌట్ బెర్త్‌ను దక్కించుకున్నాయి. ఇక నాలుగో స్థానం కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య పోటీ నెలకొంది.

శనివారం ఈ మ్యాచ్ జరుగనుంది. ఇందులో గెలిచే జట్టు నాకౌట్‌కు అర్హత సాధిస్తుంది. గుజరాత్, సన్‌రైజర్స్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. ఏకధాటిగా కురిసిన భారీ వర్షంతో కనీసం టాస్ కూడా వేసే పరిస్థితి లేకుండా పోయింది. గురువారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. మ్యాచ్ ఆరంభానికి కొద్ది గంటల ముందు భారీ వర్షం కురిసింది. దీంతో ఉప్పల్ స్టేడియం తడిసి ముద్దయ్యింది. మైదానం మొత్తం చిత్తడిగా మారడంతో మ్యాచ్‌ను రద్దు చేయక తప్పలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News